TrueTelangana

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెరాస సీనియర్‌ నేత

హైదరాబాద్ : తెరాస స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెరాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పేరును చేర్చారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు తెరాస లేఖ రాసింది. తొలి జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా 20 మంది తెరాస జాబితాలో ఉన్నారు. 11 మంది మంత్రులు, ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రవణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రావు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఆ జాబితాలో హరీశ్‌రావు పేరు లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసి హరీశ్‌రావు పేరును అందులో చేర్చాలని కోరారు.