TrueTelangana

ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు రూ. 100 కోట్ల జరిమానా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ రూ. 100 కోట్ల జరిమానా విధించింది. కృష్ణానది దగ్గర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస సమీపంలో రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీకి కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై చర్య తీసుకోవాలని వాటర్మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ నేషనల్ ట్రిబ్యూనల్లో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి వందకోట్లు జరిమానా విధించింది.