TrueTelangana

విశాఖ జిల్లా : వైసీపీ అనుకూల సర్వేలు

ప్రతిపక్షంపై మాటల దాడి, పక్క రాష్ట్ర సీఎంపై విమర్శలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రచారం సాగిస్తుండగా ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతున్నారు. తాజాగా వెలువడిన విశాఖ జిల్లాలోని 3 లోక్ సభ ,17 అసెంబ్లీ స్థానాల గెలుపు సర్వేలు వైసీపీ కి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ అందరూ హేమాహేమీలు పోటీ లో ఉండగా గెలుపు మాత్రం వైసీపీ దే అంటున్నాయి సర్వేలు.

అయితే 2014 ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న టీడీపీ రాష్ట్రంలోనే ప్రభల శక్తి గా వెలిగింది. అలాగే వైసీపీ కేవలం 3 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయ్యింది.ఇదంతా ఇలా ఉంటే ఈ సారి మాత్రం వైసీపీ గాలి బలంగా వీస్తుందని తేలింది. పోయిన ఎన్నికలకు పూర్తి వ్యతిరేక వాతావరణం జిల్లాలో కనిపిస్తుంది. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రభుత్వ వ్యతిరేకతలు తోడయ్యి వైసీపీ భారీ మెజారిటీతో గెల్వబోతుందని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ ఈ సారి 8 స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని ,టీడీపీ 7 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది.