TrueTelangana

విజయసాయి రెడ్డి ఆర్థిక ఉగ్రవాది : శివాజీ

సినీ నటుడు శివాజీ టీడీపీ పార్టీ కి మద్దతుగా ఇతర పార్టీల మీద విమర్శలు కొత్తేమి కాదు. ఈసారి శివాజీ, కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్‌కు మద్దతుగా ప్రచారంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని, రాష్ట్రంపై నాలుగు పార్టీలు కుట్రలు చేస్తున్నారని, త్వరలో అన్ని బయటపెడతాను అన్నారు.